కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రజనీతో తమన్నా

ABN, First Publish Date - 2023-09-12T00:59:05+05:30

‘జైలర్‌’తో ఓ సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకొన్నారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ప్రస్తుతం ‘లాల్‌ సలామ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు...

‘జైలర్‌’తో ఓ సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకొన్నారు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌. ప్రస్తుతం ‘లాల్‌ సలామ్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తరవాతి సినిమాపై ఓ క్లారిటీ వచ్చింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజనీ ఓ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కథానాయికగా తమన్నా పేరు పరిశీలనలో ఉంది. ‘జైలర్‌’లో తమన్నా కనిపించినప్పటికీ ఆమెది అతిథి పాత్ర మాత్రమే. రజనీతో కలిసి నటించే అవకాశమే తమన్నాకు రాలేదు. ఈసారి మాత్రం పూర్తి స్థాయి కథానాయిక పాత్ర దక్కినట్టు తెలుస్తోంది. అనిరుథ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. లోకేష్‌ ప్రస్తుతం ‘లియో’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే రజనీ సినిమాని పట్టాలెక్కిస్తారు.

Updated Date - 2023-09-12T00:59:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!