Trisha : మన్సూర్‌ అలీఖాన్‌పై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2023-11-21T01:17:23+05:30 IST

ప్రముఖ కథానాయికత్రిషను ఉద్దేశించి నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. త్రిషను అగౌరపరిచేలా వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌ అలీఖాన్‌పై...

Trisha : మన్సూర్‌ అలీఖాన్‌పై చర్యలు తీసుకోండి

జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశం

ప్రముఖ కథానాయికత్రిషను ఉద్దేశించి నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ స్పందించింది. త్రిషను అగౌరపరిచేలా వ్యాఖ్యలు చేసిన మన్సూర్‌ అలీఖాన్‌పై కేసు నమోదు చేసి తగిన చర్యలను తీసుకోవాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. ‘త్రిషను ఉద్దేశించి మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను మేం ఖండిస్తున్నాం. అతనిపై ఐపీసీ 509బి (ఎలకా్ట్రనిక్‌ మీడియాలో లైంగిక ఆరోపణలు)తో పాటు ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి చర్యలను సహించేది లేదు’ అని కమిషన్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేసింది. సీనియర్‌ నటి ఖుష్బూ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్న విషయం తెల్సిందే. త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తాజాగా వివరణ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. నడిగర్‌ సంఘం నుంచి నోటీసులు వస్తే విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఇపుడు తానేం మాట్లాడినా తప్పుగానే అనిపిస్తుందని, నిజం తెలిసినా ఎవ్వరూ బయటకు వెల్లడించరని మన్సూర్‌ అలీఖాన్‌ పేర్కొన్నారు.

(ఆంధ్రజ్యోతి, చెన్నై)

‘‘త్రిషపై మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన నీచమైన, కించపరిచే వ్యాఖ్యల్ని నేను బలంగా ఖండిస్తున్నా. పురుషాహంకారానికి ఈ సమాజంలో తావులేదు. మన పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఇలాంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిలబడాలని నేను అందరినీ కోరుకొంటున్నా’’

నితిన్‌

Updated Date - 2023-11-21T01:17:25+05:30 IST