సస్పెన్స్ స్టోరీ
ABN, First Publish Date - 2023-07-10T00:42:43+05:30
రుహానీ శర్మ ప్రధానపాత్ర పోషిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హర్’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో వరుణ్‌తేజ్ విడుదల చేసి...
రుహానీ శర్మ ప్రధానపాత్ర పోషిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘హర్’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో వరుణ్‌తేజ్ విడుదల చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘నో నాన్సెన్స్’ అంటూ ఓ చమత్కారమైన నోట్‌తో ప్రారంభమైన ట్రైలర్ ప్రేక్షకులను అలరించే అంశాలతో ఆకట్టుకుంది. ఇదొక సస్పెన్స్ స్టోరీ, సినిమా ఆద్యంతం అలరిస్తుందని రుహానీ శర్మ చెప్పారు. శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు.