చిరంజీవి చిత్రంలో సుశాంత్‌

ABN , First Publish Date - 2023-03-19T00:43:11+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ చిత్రంలో సుశాంత్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన, లవర్‌ బాయ్‌ తరహా పాత్రలో సుశాంత్‌ నటిస్తున్నారని ఆయన పుట్టిన రోజు సందర్భంగా...

చిరంజీవి చిత్రంలో సుశాంత్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ చిత్రంలో సుశాంత్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో చాలా ప్రత్యేకమైన, లవర్‌ బాయ్‌ తరహా పాత్రలో సుశాంత్‌ నటిస్తున్నారని ఆయన పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్‌ వెల్లడించారు. అలాగే సుశాంత్‌ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. లైట్‌ గడ్డంతో సూట్‌లో మెరిసిపోతున్నారు సుశాంత్‌. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థతో కలసి అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ మాసివ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో తమన్నా హీరోయిన్‌. మెగాస్టార్‌ చెల్లెలుగా కీర్తి సురేశ్‌ నటిస్తున్నారు.

Updated Date - 2023-03-19T00:43:11+05:30 IST