కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నాని సినిమాలో సూర్య

ABN, First Publish Date - 2023-10-23T01:17:30+05:30

నాని - వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఎస్‌.జె.సూర్యని...

నాని - వివేక్‌ ఆత్రేయ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మాత. ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఎస్‌.జె.సూర్యని ఎంచుకొన్నారు. బుధవారం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ‘‘అంటే.. సుందరానికి తరవాత ఈ క్రేజీ కాంబో మరోసారి రాబోతోంది. ఈ కథలో సూర్య పాత్ర చాలా కీలకం. ఆయన మాత్రమే చేయగలిగిన క్యారెక్టర్‌ ఇది. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య, దాసరి కల్యాణ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2023-10-23T01:17:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!