విక్రమ్‌తో సురేందర్ రెడ్డి?
ABN , First Publish Date - 2023-10-31T06:05:38+05:30 IST
‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘ధృవ’లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్ని అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ ఆయన్ని అన్ని రకాలుగా నిరాశ పరిచింది...

‘కిక్’, ‘రేసుగుర్రం’, ‘ధృవ’లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్ని అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి. ఇటీవల విడుదలైన ‘ఏజెంట్’ ఆయన్ని అన్ని రకాలుగా నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఆయన తరువాతి ప్రాజెక్ట్‌పై తలమునకలై ఉన్నారు. వెంకటేశ్ కోసం ఆయన ఓ కథ సిద్దం చేస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. మరోవైపు ‘చియాన్’ విక్రమ్‌తో కూడా సురేందర్ రెడ్డి టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది. విక్రమ్ కోసం ఆయన ఓ ప్రాజెక్ట్ సెట్ చేశారని సమాచారం. సూరితో పని చేయడానికి విక్రమ్ రెడీగా ఉన్నారట. విక్రమ్ ఎంచుకొనే కథలు విభిన్నంగా ఉంటాయి. కథలో, ఆయన పాత్రలో రకరకాల గెటప్పులు ఉంటాయి. సూరి కూడా అలాంటి కథనే రెడీ చేశారని, ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తారని తెలుస్తోంది.