సూపర్‌హీరో హనుమాన్‌

ABN , First Publish Date - 2023-11-15T01:02:58+05:30 IST

తేజ సజ్జా కథానాయకుడిగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హను-మాన్‌’. సూపర్‌ హీరో జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. బాలల దినోత్సవం సందర్భంగా...

సూపర్‌హీరో హనుమాన్‌

తేజ సజ్జా కథానాయకుడిగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘హను-మాన్‌’. సూపర్‌ హీరో జానర్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. బాలల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి రెండో పాటను మంగళవారం యూనిట్‌ విడుదల చేసింది. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. అనుదీ్‌పదేవ్‌ స్వరాలందించగా, వాగ్దేవి, ప్రకృతి, మయూఖ్‌ హృద్యంగా ఆలపించారు. అమృత అయ్యర్‌ కథానాయికగా నటిస్తుండగా, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. వినయ్‌రాయ్‌ ప్రతినాయకుడు. కె నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2023-11-15T01:03:07+05:30 IST