బిగ్‌ బి-నామ్‌తో సునా హోగా

ABN , First Publish Date - 2023-12-18T01:30:10+05:30 IST

రవితేజ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఇటీవలే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై...

బిగ్‌ బి-నామ్‌తో సునా హోగా

రవితేజ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో ఇటీవలే ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మిస్టర్‌ బచ్చన్‌’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ను నిర్ణయించారు. ‘బిగ్‌ బి-నామ్‌ తో సునా హోగా’ అనే పాపులర్‌ డైలాగ్‌ ఈ సినిమాకు ట్యాగ్‌లైన్‌. మేకర్స్‌ ఆదివారం ఈ చిత్రం షూటింగ్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి టైటిల్‌ను ఖరారు చేశారు. తొలి షాట్‌కు కుమార్‌ మంగత్‌ పాఠక్‌ క్లాప్‌ ఇచ్చారు. ఎంపీ కె రఘురామకృష్ణ, టీజీ భరత్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వి.వి. వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు. రవితేజ, టీజీ విశ్వప్రసాద్‌ స్ర్కిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్‌ పోస్టర్‌లో రవితేజ అమితాబ్‌ ను అనుకరిస్తూ స్కూటర్‌పై కూర్చొని ఉన్న లుక్‌ ఆకట్టుకుంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: అయనంక బోస్‌.

Updated Date - 2023-12-18T01:30:12+05:30 IST