నవ్వించే సుబ్రహ్మణ్యం

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:36 AM

విభిన్న పాత్రలతో, తనదైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న నటుడు రావు రమేశ్‌ కథను నడిపించే ప్రధాన పాత్రధారిగా రూపుదిద్దుకొన్న చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’...

నవ్వించే సుబ్రహ్మణ్యం

విభిన్న పాత్రలతో, తనదైన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న నటుడు రావు రమేశ్‌ కథను నడిపించే ప్రధాన పాత్రధారిగా రూపుదిద్దుకొన్న చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’. ఇందులో ఇంద్రజ కీలక పాత్ర పోషించారు. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ చిత్రానికి లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. చిత్ర నిర్మాణం పూర్తయిన సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ ‘రావు రమేశ్‌గారిని ఇంతవరకూ చూసిన దానికన్నా పది రెట్లు వినోదభరితమైన పాత్రలో చూస్తారు. తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎక్కువ డేట్స్‌ కేటాయించి సినిమా పూర్తి కావడానికి ఎంతో సహకరించారు. తెలుగు ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించే చిత్రం ఇది’ అన్నారు. అజీజ్‌ నగర్‌, బీహెచ్‌ఈఎల్‌, కనకమామిడి, వనస్థలిపురం, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ చేసినట్లు నిర్మాతలు చెప్పారు. అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి, అజయ్‌, హర్షవర్ధన్‌, ప్రవీణ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కల్యాణ్‌ నాయక్‌, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి. నిర్మాణం: పీబీఆర్‌ సినిమాస్‌, లోకమాత్ర సినిమాటిక్స్‌.

Updated Date - Dec 19 , 2023 | 12:36 AM