స్టైలిష్ స్టార్ @ : 20
ABN , First Publish Date - 2023-03-29T02:41:13+05:30 IST
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ‘గంగోత్రి’తో అరంగేట్రం చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ అంటే అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ తనయుడు, చిరంజీవి మేనల్లుడు. అంతే! కానీ ఇప్పుడు బన్నీ అంటే స్టైలిష్ స్టార్, యూత్ ఐకాన్, ఓ పాన్ ఇండియా హీరో...

సరిగ్గా 20 ఏళ్ల క్రితం ‘గంగోత్రి’తో అరంగేట్రం చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ అంటే అల్లు రామలింగయ్య మనవడు, అల్లు అరవింద్ తనయుడు, చిరంజీవి మేనల్లుడు. అంతే! కానీ ఇప్పుడు బన్నీ అంటే స్టైలిష్ స్టార్, యూత్ ఐకాన్, ఓ పాన్ ఇండియా హీరో. అంచెలంచెలుగా ఎదిగి, ఇప్పుడు అనంతమైన క్రేజ్ సంపాదించుకొన్నారు బన్నీ. ఇదంతా.. తన కష్టార్జితం. ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప’ వరకూ బన్నీ ఎదిగిన తీరు ఓ సూపర్ హిట్ సినిమా స్ర్కిప్టంత క్రేజీగా ఉంటుంది. సినిమా సినిమాకీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు ఎవరికీ అందనంత స్థాయికి చేరుకొన్నాడు. తన సినీ ప్రయాణంలో 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రేక్షకులకు, తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు బన్నీ. ‘‘నేను చిత్రసీమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయింది. నేను ఈ స్థాయిలో ఉండడానికి ప్రేక్షకులు, అభి మానులే కారణం. వాళ్లకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు అల్లు అర్జున్.