స్టూడెంట్‌ వస్తున్నాడు సార్‌

ABN , First Publish Date - 2023-05-13T05:59:18+05:30 IST

బెల్లంకొండ గణేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు

స్టూడెంట్‌ వస్తున్నాడు సార్‌

బెల్లంకొండ గణేశ్‌ హీరోగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌’. రాఖీ ఉప్పలపాటి దర్శకుడు. అవంతిక దస్సాని కథానాయిక. ‘నాంది’ సతీశ్‌ వర్మ నిర్మాత. జూన్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. గణేశ్‌కి కొత్త తరహా ఇమేజ్‌ తీసుకొస్తుంది.యూత్‌కి నచ్చే అన్ని అంశాలూ ఉన్నాయి. సముద్రఖని పాత్ర కీలకం. ఆయన తన నటనతో మరోసారి ఆకట్టుకొంటారు. సినిమా ఎప్పుడో పూర్తయింది. మంచి రిలీజ్‌ డేట్‌ కోసం ఎదురు చూశామ’’న్నారు. సంగీతం: మహతి స్వర సాగర్‌.

Updated Date - 2023-05-13T05:59:24+05:30 IST