Started in Italy : ఇటలీలో మొదలెట్టారు

ABN , First Publish Date - 2023-09-25T01:19:13+05:30 IST

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి నిర్మాత. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది...

Started in Italy : ఇటలీలో మొదలెట్టారు

గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. వేణు దోనేపూడి నిర్మాత. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పుడు షూటింగ్‌ మొదలెట్టారు. సోమవారం నుంచి ఇటలీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆదివారం శ్రీనువైట్ల పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియో విడుదల చేస్తూ దర్శకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఇటలీలోని మటెరా నేపథ్యంలోని కొన్ని అందమైన లొకేషన్లలో షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. కీలక సన్నివేశాలన్నీ విదేశాల్లోనే తెరకెక్కిస్తాం. త్వరలోనే టైటిల్‌, ఇతర వివరాలు వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌.

Updated Date - 2023-09-25T01:19:13+05:30 IST