మెగా క్లా్‌పతో ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-25T03:03:19+05:30 IST

సూపర్‌హిట్‌ చిత్రం ‘భీష్మ’ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ అవుతోంది. నితిన్‌, రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది...

మెగా క్లా్‌పతో ప్రారంభం

సూపర్‌హిట్‌ చిత్రం ‘భీష్మ’ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ అవుతోంది. నితిన్‌, రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర యి ముహూర్తం షాట్‌కు క్లాప్‌ ఇచ్చారు. దర్శకుడు బాబీ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. గోపిచంద్‌ మలినేని తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. హను రాఘవపూడి, బుచ్చిబాబు సాన స్ర్కిప్ట్‌ను చిత్రబృందానికి అందించారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, వెన్నెల కిశోర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. వినోదం, యాక్షన్‌ మేళవింపుతో సాగుతుందని చిత్రబృందం తెలిపింది. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌

Updated Date - 2023-03-25T03:03:21+05:30 IST