రంగంలోకి రంగస్థలం కాంబో!

ABN , First Publish Date - 2023-08-29T03:17:34+05:30 IST

రామ్‌ చరణ్‌ కెరీర్‌లో మర్చిపోలేని సినిమా ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా...

రంగంలోకి రంగస్థలం కాంబో!

రామ్‌ చరణ్‌ కెరీర్‌లో మర్చిపోలేని సినిమా ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఇప్పుడు చరణ్‌ - సుకుమార్‌ కాంబోలో మరో సినిమా రాబోతోందని ఇన్‌ సైడ్‌ వర్గాల టాక్‌. ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉన్నారు చరణ్‌. ఆ తరవాత ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబుతో ఓ సినిమా ఉంటుంది. ఇది డిసెంబరులో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సుకుమార్‌ కూడా ‘పుష్ప 2’ ప్రాజెక్టులో తలమునకలై ఉన్నారు. 2024 వేసవిలో ఈ చిత్రం విడుదల అవుతుంది. ఆ తరవాత చరణ్‌ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభిస్తారు. 2024 చివర్లో ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘రంగస్థలం’తో టాలీవుడ్‌ని షేక్‌ చేసిన ఈ జోడీ.. ఈసారి ఇంకెంత హంగామా సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - 2023-08-29T03:17:34+05:30 IST