గూఢచారి గందరగోళం
ABN , First Publish Date - 2023-08-24T02:44:28+05:30 IST
వెన్నెల కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. అదితి సోనీ నిర్మాత...

వెన్నెల కిశోర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకుడు. సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. అదితి సోనీ నిర్మాత. బుధవారం కాన్సెప్ట్ లోగోని విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఓ గందరగోళ గూఢచారి కథ ఇది. వెన్నెల కిశోర్ పాత్ర చిత్రణే ప్రధాన ఆకర్షణ. ఓ పట్నంలో జరిగే అనుమానాస్పద సంఘటల వెనుక ఉన్న మర్మాన్ని శోధించడానికి గూఢచారి 111 చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన నటన కూడా ప్రధాన బలం’’ అన్నారు. ‘‘ఈ కథలో చాలా షాక్‌లు ఉన్నాయి. విలన్ ఎవనేది కూడా ట్విస్టే. ఇప్పటి వరకూ తీసిన సన్నివేశాలు మాకెంతో సంతృప్తి కలిగించాయ’’ని నిర్మాత తెలిపారు. బ్రహ్మాజీ, సత్య, రాహుల్ రవీంద్రన్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: సైమన్ కె.కింగ్.