సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sports drama in 18 languages : 18 భాషల్లో స్పోర్ట్స్‌ డ్రామా

ABN, First Publish Date - 2023-05-19T02:15:37+05:30

స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఓ భారీ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నట్లు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం వివరాలను ఆయన ప్రకటించారు. ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ దివి హీరోయిన్‌గా నటిస్తారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో ఓ భారీ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నట్లు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ చెప్పారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం వివరాలను ఆయన ప్రకటించారు. ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ దివి హీరోయిన్‌గా నటిస్తారని, ఒక సామాన్య యువతి పట్టుదలతో పైకి ఎదిగి, స్పోర్స్ట్‌లో జాతీయ స్థాయిలో ఎలా గుర్తింపు తెచ్చుకుందనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుందనీ, దేశంలోని 14 ప్రధాన భాషలతో పాటు, నాలుగు ఉప భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఆర్‌.కె. గౌడ్‌ చెప్పారు. రాజ్‌కిరణ్‌, రఘురామ్‌ సంగీత సారథ్యంలో ఇంతవరకూ మూడు పాటలను రికార్డ్‌ చేశారు. గీతామాధురి, మంగ్లీ, మధుప్రియ ఈ పాటలను అలపించారు. జూన్‌లో ప్రారంభమయ్యే ఈ చిత్రంలో హెబ్బా పటేల్‌, క్రాంతిక, ఆషా రాథోడ్‌, భవ్యశ్రీ, సింధూజ, జ్యోతి, శుభశ్రీ ఇతర ముఖ్య తారాగణం. మాటలు: వంశీ, పాటలు: చంద్రబోస్‌, గురుచరణ్‌, మానికోటి ప్రసాద్‌, తేజ, ఫొటోగ్రఫీ: సెంథిల్‌ కుమార్‌, కో ప్రొడ్యూసర్‌: కూరగాయల లక్ష్మీపతి.

Updated Date - 2023-05-19T02:15:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!