ఫుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ పార్టీ

ABN , First Publish Date - 2023-08-21T02:23:46+05:30 IST

వీజే సన్నీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్‌. సంజయ్‌ శేరి దర్శకుడు.

ఫుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ పార్టీ

వీజే సన్నీ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. హ్రితిక శ్రీనివాస్‌ హీరోయిన్‌. సంజయ్‌ శేరి దర్శకుడు. ఇటీవలే దర్శకుడు సంపత్‌నంది చేతుల మీదుగా ‘సౌండ్‌పార్టీ’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం మరో ‘జాతిరత్నాలు’లా ఉండబోతోంది. టీజర్‌ బాగుంది’ అని ప్రశంసించారు. నిర్మాత రవి పోలిశెట్టి మాట్లాడుతూ ‘ఫుల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. సెప్టెంబర్‌లో విడుదల చేస్తాం’ అని చెప్పారు. 28 రోజుల్లో సినిమాను పూర్తి చేశాం, సన్నీ, శివన్నారాయణ పాత్రలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి అని దర్శకుడు అన్నారు. చాలా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమా చేశామని వీజే సన్నీ తెలిపారు.

Updated Date - 2023-08-21T02:23:46+05:30 IST