ఆగస్టులో సౌండ్ పార్టీ
ABN , First Publish Date - 2023-06-30T02:16:08+05:30 IST
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పిస్తున్నారు. సంజయ్‌శేరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు...
వీజే సన్నీ, హ్రితికా శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సౌండ్ పార్టీ’. దర్శకుడు జయశంకర్ సమర్పిస్తున్నారు. సంజయ్‌శేరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవి పోలిశెట్టి నిర్మాత. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా సినిమా టైటిల్ లోగోను సినీ జర్నలిస్టుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని జయశంకర్ తెలిపారు. 25 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశామని నిర్మాత చెప్పారు. ఇదొక ఫుల్ ఫన్‌రైడ్ చిత్రమని సంజయ్ శేరి చెప్పారు.