సోల్ ఆఫ్ సత్య
ABN , First Publish Date - 2023-08-09T03:57:31+05:30 IST
దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన ఓ మ్యూజికల్ షార్ట్‌ను ‘సత్య’ పేరుతో హీరో సాయిధరమ్ తేజ్ తన స్నేహితులతో కలసి రూపొందించారు. ఇందులో సాయిధరమ్ తేజ్...

దేశం కోసం పోరాటం చేసే అజ్ఞాత యోధులకు సంబంధించిన ఓ మ్యూజికల్ షార్ట్‌ను ‘సత్య’ పేరుతో హీరో సాయిధరమ్ తేజ్ తన స్నేహితులతో కలసి రూపొందించారు. ఇందులో సాయిధరమ్ తేజ్ సైనికుడిగా, ఆయన భార్యగా కలర్స్ స్వాతి నటించారు. ఈ వీడియో నుంచి ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో గ్లింప్స్ విడుదల చేశారు. ఈ మ్యూజికల్ షార్ట్‌లోని పాటను శ్రుతి రంజని కంపోజ్ చేశారు. ఓ సైనికుడి భార్య దేశం కోసం చేసే త్యాగాలను ఇందులో చూపిస్తున్నారు. ఇదే ‘సత్య’లోని ప్రధానమైన ఎమోషన్. సాయిధరమ్ తేజ్, ఆయన స్నేహితులు హర్షిత్ రెడ్డి, నవీన్ విజయ్ కృష్ణ ఈ మ్యూజికల్ షార్ట్‌కు భాగస్వాములుగా వ్యవహరించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్‌రెడ్డి, హన్షిత రెడ్డి రూపొందించారు. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు.