Slumdog Husband : నవ్వించే స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌

ABN , First Publish Date - 2023-07-25T03:03:56+05:30 IST

సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ‘స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌’ ఈ నెల 29న విడుదల కానుంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది. పూరి జగన్నాథ్‌ శిష్యుడు డాక్టర్‌ ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర

Slumdog Husband : నవ్వించే స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌

సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ‘స్లమ్‌డాగ్‌ హజ్బెండ్‌’ ఈ నెల 29న విడుదల కానుంది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది. పూరి జగన్నాథ్‌ శిష్యుడు డాక్టర్‌ ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్‌ అన్పపరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’ పూర్తి వినోదాత్మకం చిత్రం. సందేశంతో పాటు మూఢ నమ్మకాల మీద సెటైర్‌ ఉంటుంది. ఈ కథ చాలా కొత్తగా, అందరూ నవ్వుకునేలా ఉంటుంది. బ్రహ్మాజీ ఈ సినిమాను నమ్మారు. ఆయనే ముందుండి ప్రమోట్‌ చేస్తున్నారు. హీరోయిన్‌గా తెలుగు అమ్మాయినే తీసుకోవాలని ఇద్దరు ముగ్గురిని ఆడిషన్‌ చేసి ప్రణవిని ఎంపిక చేశాం. మంచి సినిమాలు తీయాలనే అభిప్రాయంతో ఈ సంస్థను ప్రారంబించాం. మొత్తం ఆరు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది మరో రెండు సినిమాలు తీస్తాం. కొత్త దర్శకులతో ఈ సినిమాలు నిర్మిస్తాం’’ అని చెప్పారు.

Updated Date - 2023-07-25T03:04:01+05:30 IST