Skanda : జోరుగా... హుషారుగా
ABN , First Publish Date - 2023-08-04T23:55:24+05:30 IST
టాలీవుడ్‌లోని మంచి డాన్సర్లలో రామ్ పోతినేని ఒకడు. తన స్పీడ్‌ని మ్యాచ్ చేయడం కథానాయికలకు కొంచెం కష్టమే. అయితే శ్రీలీల కూడా డాన్సుల్లో గట్టి పోటీ ఇస్తోంది. ‘పె

టాలీవుడ్‌లోని మంచి డాన్సర్లలో రామ్ పోతినేని ఒకడు. తన స్పీడ్‌ని మ్యాచ్ చేయడం కథానాయికలకు కొంచెం కష్టమే. అయితే శ్రీలీల కూడా డాన్సుల్లో గట్టి పోటీ ఇస్తోంది. ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ చిత్రాలలో శ్రీలీల డాన్సులు చూసి ఆమెకు అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి స్టెప్పులేస్తే ఇక ఆ జోరు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ‘స్కంద’ ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. రామ్, శ్రీలీల జంటగా నటించారు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ చిత్రం నుంచి ‘నీ చుట్టు చుట్టు’ అనే పాట విడుదలైంది. హుషారైన బాణీకి రామ్, శ్రీలీల ఇద్దరూ అదిరిపోయే స్టెప్పులేశారు. తమన్ స్వర పరిచిన ఈ గీతాన్ని సిద్ద్ శ్రీరామ్, సంజన పాడారు. రఘురామ్ సాహిత్యం అందించారు. ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులతో పాటు కాస్ట్యూమ్స్, సెట్స్.. ఇవన్నీ ఆకట్టుకొనేలా ఉన్నాయి. సెప్టెంబరు 15న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.