అరవై ఏళ్ల లవకుశ
ABN , First Publish Date - 2023-03-29T02:30:07+05:30 IST
‘ప్రతి ఏడాది ఎన్నో చిత్రాలు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే కాల పరీక్షకు తట్టుకుని నిలబడి, క్లాసిక్స్‌గా నిలిచే చిత్రాలు కొన్నే ఉంటాయి. సినిమా అనేది ఓ వ్యాపారమే...

‘ప్రతి ఏడాది ఎన్నో చిత్రాలు వస్తుంటాయి, పోతుంటాయి. అయితే కాల పరీక్షకు తట్టుకుని నిలబడి, క్లాసిక్స్‌గా నిలిచే చిత్రాలు కొన్నే ఉంటాయి. సినిమా అనేది ఓ వ్యాపారమే. అయినా దీక్షతో, తపస్సుతో నిర్మించిన సినిమాల సంఖ్యను వేళ్ల మీద లెక్కించవచ్చు. వాటిల్లో ముందు వరుసలో నిలిచే చిత్రం ‘లవకుశ’. ఎన్టీఆర్ నట విశ్వరూపం, తండ్రీకొడుకులు సి.పుల్లయ్య, సి.ఎస్ రావు దర్శకత్వ ప్రతిభ, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల అందించిన మధురమైన పాటలు ఈ చిత్రానికి శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టాయి. 1969 మార్చి 29న ‘లవకుశ’ విడుదలైంది.
తెలుగులో తొలి రంగుల చిత్రం ఇది. ‘సీతారామ కల్యాణం’ (1961)లో రావణుడిగా అందరి ప్రశంసలు పొందిన ఎన్టీఆర్ రెండేళ్ల తర్వాత వచ్చిన ‘లవకుశ’లో రాముడిగానూ అలరించడం విశేషం. సీతగా అంజలీదేవి నటించారు. ‘వ్యాంప్ వేషాలు వేసే నటి సీత పాత్ర చేయడం ఏమిటి?’ అనే విమర్శలు వినిపించినా దర్శకుడు పుల్లయ్య లెక్క చేయలేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు అంజలీదేవి
రామునిగా నటించిన రామారావు, సీత పాత్రతో అంజలీదేవి అప్పట్లో ప్రేక్షకులకు దైవ సమానులైపోయారు. ఎక్కడికి వెళ్లినా వారికి పాదాభివందనాలు చేసి, హారతులు పట్టి తమ భక్తిని చాటుకునేవారు జనం. వాల్మీకిగా నాగయ్య, లక్ష్మణునిగా కాంతారావు, లవకుశులుగా మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, భూదేవిగా ఎస్. వరలక్ష్మి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
1963 మార్చి 29న విడుదలైన 26 కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడింది..