సిక్స్‌ ప్యాక్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌

ABN , First Publish Date - 2023-11-02T02:53:49+05:30 IST

హీరో రామ్‌ మళ్లీ ఉస్తాద్‌ మోడ్‌లోకి వచ్చారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం షూటింగ్‌ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది...

సిక్స్‌ ప్యాక్‌.. డబుల్‌ ఇస్మార్ట్‌

హీరో రామ్‌ మళ్లీ ఉస్తాద్‌ మోడ్‌లోకి వచ్చారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం షూటింగ్‌ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ‘స్కంద’ చిత్రం కోసం బరువు పెరిగిన రామ్‌ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ కోసం కొన్ని కిలోలు మళ్లీ తగ్గారు. అంతే కాదు ఈ సినిమా కోసం సిక్స్‌ ప్యాక్‌ అబ్స్‌ సాధించారు. దీనికి సంబంధించిన ఫొటోను బుధవారం విడుదల చేశారు. రామ్‌, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చి బ్లాక్‌ బస్టర్‌ అయిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు సీక్వెల్‌గా డబుల్‌ ఇస్మార్ట్‌’ రూపుదిద్దుకుంటోంది. పూరి కనెక్ట్స్‌ బేనరుపై పూరి జగన్నాథ్‌, ఛార్మి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్‌దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మాస్‌, యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా సరికొత్త అనుభూతినిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, హై బడ్జెట్‌తో రూపుదిద్దుకొనే ఈ చిత్రం 2024 మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా విడుదలవుతుంది.

Updated Date - 2023-11-02T02:53:49+05:30 IST