ఆరు ఎపిసోడ్స్ అలరిస్తాయి
ABN , First Publish Date - 2023-10-05T03:35:33+05:30 IST
ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ వెబ్‌సిరీస్ ‘మాన్షన్ 24’. వరలక్ష్మీ శరత్‌కుమార్, అవికాగోర్, బిందుమాధవి, నందు, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషించారు...

ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ వెబ్‌సిరీస్ ‘మాన్షన్ 24’. వరలక్ష్మీ శరత్‌కుమార్, అవికాగోర్, బిందుమాధవి, నందు, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవనుంది. బుధవారం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ ‘కాంప్రమైజ్ కాకుండా ఈ సిరీస్‌ను తెరకెక్కించాం. ఆరు ఎపిసోడ్స్ ఆగకుండా చూసేలా ఉంటాయి’ అన్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘మాన్షన్ 24’ సిరీస్‌లో నాకు మంచి పాత్ర ఇచ్చారు. సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుంది’ అన్నారు. ‘ప్రొడ్యూసర్‌గానే కాదు, ప్రేక్షకుడిగానూ ఈ సిరీస్ నాకు బాగా నచ్చింది’ అని అశ్విన్‌బాబు తెలిపారు.