పంపిణీరంగంలోకి సితార
ABN , First Publish Date - 2023-07-20T00:26:30+05:30 IST
తమిళ హీరో ధనుష్ నటించిన ‘సార్’ (తమిళంలో ‘వాతి)చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా తమిళ విజయ్ నటిస్తున్న భారీ చిత్రం ‘లియో’లో భాగస్వామి అవుతోంది...
తమిళ హీరో ధనుష్ నటించిన ‘సార్’ (తమిళంలో ‘వాతి)చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా తమిళ విజయ్ నటిస్తున్న భారీ చిత్రం ‘లియో’లో భాగస్వామి అవుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ రంగంలోకి అడుగు పెట్టాలని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్ణయించుకుంది. విజయ్ మార్కెట్‌ను, ఆయన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని తెలుగులో ఆయన చిత్రాలకు మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు సితార సంస్థ పేర్కొంది.