సింగిల్‌ షాట్‌... సింగిల్‌ క్యారెక్టర్‌

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:50 AM

రాజు దుస్స దర్శకత్వంలో హన్సిక లీడ్‌రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘105 మినిట్స్‌’. బొమ్మక్‌ శివ నిర్మాత. జనవరి 26న విడుదలవుతోంది...

సింగిల్‌ షాట్‌... సింగిల్‌ క్యారెక్టర్‌

రాజు దుస్స దర్శకత్వంలో హన్సిక లీడ్‌రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘105 మినిట్స్‌’. బొమ్మక్‌ శివ నిర్మాత. జనవరి 26న విడుదలవుతోంది. దర్శకుడు అజయ్‌ భూపతి చేతుల మీదుగా ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. రక్తమోడుతున్న లుక్‌లో హన్సిక కనిపించారు. సింగిల్‌ షాట్‌ సింగిల్‌ క్యారెక్టర్‌ మూవీగా తెరకెక్కడం ఈ చిత్రం ప్రత్యేకత అని యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి శ్యాం సీఎస్‌ సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ: కిషోర్‌ బోయిదాపు.

Updated Date - Dec 31 , 2023 | 04:50 AM