SIIMA Awards : అట్టహాసంగా సైమా అవార్డ్స్
ABN , First Publish Date - 2023-09-17T02:16:44+05:30 IST
దుబాయ్ నగరం టాలీవుడ్ తారాలోకంతో వెలిగిపోయింది. అంగరంగ వైభవంగా జరిగిన సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023) అవార్డ్స్ కార్యక్రమం ఇందుకు వేదికైంది...

దుబాయ్ నగరం టాలీవుడ్ తారాలోకంతో వెలిగిపోయింది. అంగరంగ వైభవంగా జరిగిన సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2023) అవార్డ్స్ కార్యక్రమం ఇందుకు వేదికైంది. రెండు రోజుల పాటు జరిగే సైమా 2023 అవార్డ్స్ కార్యక్రమం శుక్రవారం అర్థరాత్రి ఘనంగా ప్రారంభమైంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో నటీనటులు, దర్శక నిర్మాతలు సహా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తళుక్కున మెరిశారు. మొదటి రోజు పలువురు తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు. ఎన్టీఆర్, రానా, అడివి శేష్, శ్రుతీహాసన్, శ్రీలీల, శ్రీనిధి, నిఖిల్, అశ్వనీదత్, రిషభ్‌శెట్టి, రక్షిత్‌శెట్టి రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. 2023 సంవత్సరానికి గాను జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి సైమా ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా (ఆర్‌ఆర్‌ఆర్) రాజమౌళి, ఉత్తమ నటిగా శ్రీలీల (ధమాకా), సహాయ నటుడిగా రానా (భీమ్లానాయక్)ను అవార్డులు వరించాయి.