సెట్స్‌పైకి సిద్దు కొత్త చిత్రం
ABN , First Publish Date - 2023-08-11T02:34:25+05:30 IST
‘డీజే టిల్లు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో యువతలో ఫాలోయింగ్ పెంచుకున్నారు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం...

‘డీజే టిల్లు’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో యువతలో ఫాలోయింగ్ పెంచుకున్నారు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం గురువారం ప్రారంభమైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బి.వి.ఎస్. ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్‌కు నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ సినిమా ఉండబోతోంది. ఈ చిత్రంలో నటించే హీరోయిన్, ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అని చెప్పారు. బాపినీడు బి. సమర్పిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిప్రకాశ్