గొంతెత్తండి... అండ దొరుకుతుంది

ABN , First Publish Date - 2023-11-29T01:07:20+05:30 IST

‘అమ్మాయిలూ... ఏదైనా సంఘటన మిమ్మల్ని బాధిస్తే మీరు మౌనంగా ఉండిపోవద్దు. గొంతెత్తితేనే మీకు ప్రజల మద్దతు లభిస్తుంది’ అని రష్మిక మందన్నా అన్నారు...

గొంతెత్తండి... అండ దొరుకుతుంది

‘అమ్మాయిలూ... ఏదైనా సంఘటన మిమ్మల్ని బాధిస్తే మీరు మౌనంగా ఉండిపోవద్దు. గొంతెత్తితేనే మీకు ప్రజల మద్దతు లభిస్తుంది’ అని రష్మిక మందన్నా అన్నారు. ఆమె డీప్‌ఫేక్‌ వీడియో ఒకటి కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ‘యానిమల్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో నాటి సంఘటనను గుర్తు చేసుకొని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. రష్మిక మాట్లాడుతూ ‘ఈ రోజుల్లో ఫేక్‌ వీడియోలు సృష్టించడం మామూలైంది. మొదట్లో ఆ వీడియో చూసినప్పుడు బాధపడ్డాను. నేనొక్కదాన్ని ఏం చేయగలను అనిపించింది. చాలా మంది అమ్మాయిలకు ఇలానే జరుగుతోంది. అందుకే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు అనుకున్నాను. అందుకే స్పందించా. నాకు మొదట అమితాబ్‌బచ్చన్‌ అండగా నిలిచారు. ఆ తర్వాత మరెంతోమంది ముందుకొచ్చారు. నాలానే ధైర్యంగా ముందుకు రావాలని అమ్మాయిలను కోరుతున్నాను. ప్రజలు మనకు అండగా నిలుస్తారు’ అని చెప్పారు.

Updated Date - 2023-11-29T01:07:22+05:30 IST