షాక్‌కు గురయ్యా

ABN , First Publish Date - 2023-05-24T01:45:17+05:30 IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో బ్రిటీష్‌ గవర్నర్‌గా నటించిన ఐరిష్‌ నటుడు రే స్టీవెన్సన్‌ ఇటలీలో కన్నుమూశారు. ఇంకో నాలుగు రోజుల్లో తన 59వ పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా...

షాక్‌కు గురయ్యా

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో బ్రిటీష్‌ గవర్నర్‌గా నటించిన ఐరిష్‌ నటుడు రే స్టీవెన్సన్‌ ఇటలీలో కన్నుమూశారు. ఇంకో నాలుగు రోజుల్లో తన 59వ పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉండగా స్టీవెన్సన్‌ ఇలా హఠాత్తుగా కన్ను మూయడం విషాదకరం. ‘స్టార్‌ వార్స్‌’ సిరీ్‌సలో భాగంగా రూపొందిన ‘అహోస్కా’ ఆగస్టులో విడుదల కానుంది. ఈ ఎనిమిది ఎపిసోడ్స్‌ సిరి్‌సలో స్టీవెన్సన్‌ విలన్‌గా నటించారు. స్టీవెన్సన్‌ మరణ వార్త తమను ఎంతో కలచివేసిందని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రదర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పేర్కొన్నారు. సెట్‌లో స్టీవెన్స్‌న్‌తో ఉన్న వర్కింగ్‌ స్టిల్‌ను రాజమౌళి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ‘షాకింగ్‌... ఈ వార్తను నమ్మలేకపోతున్నా. రే సెట్‌లో ఉన్నారంటే ఎంత సందడిగా ఉండేది. ఫుల్‌ ఎనర్జీతో ఆయన ఉండేవారు. ఆయనతో కలసి పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. స్టీవెన్సన్‌తో వర్క్‌ చేయడం గొప్ప అనుభూతి ఇచ్చిందని ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు.

Updated Date - 2023-05-24T01:45:17+05:30 IST