యానిమల్‌లో నగ్నంగా నటించింది ఈమే!
ABN, First Publish Date - 2023-12-05T02:03:34+05:30
రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్‌లో సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తోంది. ఈ సినిమా చూస్తూ రణబీర్...
రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్‌లో సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీసు రికార్డులు తిరగరాస్తోంది. ఈ సినిమా చూస్తూ రణబీర్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న మితి మీరిన హింస, అసభ్యకరమైన డైలాగులు, ముఖ్యంగా న్యూడ్ సీన్ విమర్శలకు గురవుతున్నాయి. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో రణబీర్ పాత్ర తన భార్య(రశ్మిక)ను మోసం చేసి, మరో యువతి జోయాతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటాడు. ఈ సందర్భంగా వచ్చే న్యూడ్ సీన్ పలు విమర్శలకు కారణమైంది. ఇంతకీ ఈ న్యూడ్ సీన్‌లో పాల్గొన్న నటి పేరు ఏమిటో తెలుసా..? త్రిప్తి దిమ్రి. ఈ చిత్రంలో నటించిన రణబీర్ కపూర్, రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్.. వీరందరూ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు కానీ త్రిప్తి విషయం మాత్రం బయట ఎక్కడా వెల్లడించలేదు. ‘యానిమాల్’ విడుదలయ్యాక ఆమె గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. 29 ఏళ్ల త్రిప్తి శ్రీదేవి నటించిన ‘మామ్’లో తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె ‘పోస్టర్ బాయ్స్’ సినిమాలో కొంత ప్రాధాన్యం కలిగిన పాత్ర పోషించింది. అయితే 2018లో వచ్చిన ‘లైలామజ్ను’ చిత్రంతోనే త్రిప్తి ఎవరనేది అందరికీ తెలిసింది. నెట్‌ఫ్లిక్స్ కోసం తయారైన ‘బుల్‌బుల్’లో ప్రాధాన్యం కలిగిన పాత్ర పోషించింది. ‘బుల్‌బుల్’ చిత్రంతో ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందడం గమనార్హం ‘యానిమల్’ చిత్రంలో ఏ మాత్రం మొహమాట పడకుండా బోల్డ్‌గా నటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించింది త్రిప్తి. ఈమె నటించిన రెండు హిందీ చిత్రాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి.