జూన్ 3న శర్వానంద్ వివాహం
ABN , First Publish Date - 2023-05-18T01:38:46+05:30 IST
యువ కథానాయకుడు శర్వానంద్ వివాహం రక్షితతో జూన్ 3న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. రెండు రోజుల పాటు ఈ వివాహ వేడుక వైభవంగా జరుగుతుంది...

యువ కథానాయకుడు శర్వానంద్ వివాహం రక్షితతో జూన్ 3న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. రెండు రోజుల పాటు ఈ వివాహ వేడుక వైభవంగా జరుగుతుంది. జూన్ 2న మెహందీ ఫంక్షన్, ఆ మర్నాడు పెళ్లికొడుకు ఫంక్షన్ జరుగుతుంది. అదే జైపూర్‌లోని లీలా ప్యాలె్‌సలో రాత్రి 11 గంటల నుంచి వివాహ వేడుక ప్రారంభమవుతుంది. శర్వానంద్, రక్షితల నిశ్చితార్థం జనవరిలో జరిగింది. హైదరాబాద్‌లో ఇరు కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు.