విముక్తి కోసం శాంతల పోరాటం

ABN , First Publish Date - 2023-11-18T00:42:07+05:30 IST

కర్ణాటక రాష్ట్రం హళిబేడు సమీపంలోని ఓ కుగ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా భారీ స్థాయిలో తెరకెక్కిన పీరియడ్‌ ఫిల్మ్‌ ‘శాంతల’. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

విముక్తి కోసం శాంతల పోరాటం

కర్ణాటక రాష్ట్రం హళిబేడు సమీపంలోని ఓ కుగ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా భారీ స్థాయిలో తెరకెక్కిన పీరియడ్‌ ఫిల్మ్‌ ‘శాంతల’. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. గిరిజన స్త్రీలను చెరబడుతున్న ఓ కామాంధుడిని ఎదిరించిన ఓ యువతి జీవితం స్ఫూర్తితో అల్లుకున్న కథ ఇది. ఈ సినిమాకు సంగీతం, నాట్యం ప్రత్యేకాకర్షణ. ప్రఖ్యాత శిల్పి జక్కన నిర్మించిన బేలూరు, హళిబేడు జంట దేవాలయాల వద్ద సుందరమైన సన్నివేశాలు, పాటలు తెరకెక్కించారు. అగ్ర నిర్మాత కే. ఎస్‌ రామారావు పర్యవేక్షణలో డాక్టర్‌ యిర్రంకి సురేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. స్త్రీ స్వాతంత్య్రం, స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి లాంటి అంశాల చుట్టూ అల్లుకున్న కథ ఇదని చిత్రబృందం పేర్కొంది. ‘శాంతల’ చిత్రంలో ప్రధానమైన సన్నివేశాలు కర్ణాటకలోని మారుమూల పాంతాల్లో వ్యయ ప్రయాసలకోర్చి దర్శకుడు శేషు పెద్దిరెడ్డి నిర్దేశకత్వంలో కె. ఎస్‌ రామారావు షూటింగ్‌ కార్యక్రమాలను నిర్వహించారు. ‘శాంతల’లో నిహర్‌ కోదాటి కథానాయకుడిగా నటించారు. ‘ది ఫ్యామిలీమేన్‌’ వెబ్‌సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల్లో చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న అశ్లేషా ఠాకూర్‌ కథానాయికగా నటించారు. నటుడు వినోద్‌కుమార్‌ ఈ చిత్రంలో భూకామాందు పాత్రలో నటించాడు. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు రాశారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.

Updated Date - 2023-11-18T00:42:08+05:30 IST