Shantala in six languages : ఆరుభాషల్లో శాంతల
ABN , First Publish Date - 2023-07-03T04:20:18+05:30 IST
‘శాంతల’ కథ బావుంది. కొత్తదనం ఉన్న చిన్న సినిమాలు హిట్టవుతున్నాయి. ఆ నమ్మకంతోనే నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను. నిర్మాతలు అమెరికాలో ఉండడంతో నిర్మాణసారథ్యం నాకు అప్పగించారు...

‘శాంతల’ కథ బావుంది. కొత్తదనం ఉన్న చిన్న సినిమాలు హిట్టవుతున్నాయి. ఆ నమ్మకంతోనే నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను. నిర్మాతలు అమెరికాలో ఉండడంతో నిర్మాణసారథ్యం నాకు అప్పగించారు. దర్శకుడు శేషు పెద్దిరెడ్డి అద్భుతంగా తీశాడు. మొత్తం ఆరు భాషల్లో ‘శాంతల’ను విడుదల చేస్తున్నా’మని నిర్మాత కె. ఎస్ రామారావు అన్నారు. కర్ణాటకలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పీరియాడిక్ చిత్రమిది. నిహాల్ కోదాటి, ఆశ్లేష ఠాకూర్ జంటగా నటించారు. డాక్టర్ యిర్రంకి సురే శ్ నిర్మించారు. ఇటీవలె చిత్రబృందం పాత్రికేయులతో ముచ్చటించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘కథ వినగానే ‘నేను నిర్మిస్తాను’ అని అవకాశమిచ్చిన కె. ఎస్ రామారావుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను’ అని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాలో భాగమైనందుకు గర్వంగా ఉందని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అన్నారు. ఇది నా హృదయానికి దగ్గరైన సినిమా అని నిహాల్ చెప్పారు. నా పాత్ర కోసం చాలా శ్రమించాను అని అశ్లేష ఠాకూర్ అన్నారు.