‘శకుని మామ’ ఇకలేరు
ABN , First Publish Date - 2023-06-06T01:57:58+05:30 IST
దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మహాభారత్’ సీరియల్‌లో శకుని మామగా నటించిన గుఫీ ఫైంటల్ సోమవారం ముంబైలోని ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన సమస్యలకు...

దూరదర్శన్‌లో ప్రసారమైన ‘మహాభారత్’ సీరియల్‌లో శకుని మామగా నటించిన గుఫీ ఫైంటల్ సోమవారం ముంబైలోని ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన సమస్యలకు చికిత్స పొందుతూ కన్ను మూశారు. 79 ఏళ్ల గుఫీ పైంటల్ అసలు పేరు సర్వజిత్ సింగ్ పైంటల్. 1980ల దశకంలో వచ్చిన ‘సుహాగ్’, ‘దిల్లగీ’ వంటి చిత్రాల్లో నటించారు. ‘సిఐడీ’, ‘హలో ఇన్‌స్పెక్టర్’ వంటి టీవీ సీరియల్స్‌లో కూడా ఆయన ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ‘మహాభారత్’ సీరియల్‌లో శకుని పాత్రతోనే ఆయన ఎంతో గుర్తింపు పొందారు. బి.ఆర్.చోప్రా రూపొందించిన ఈ సీరియల్‌కు ఎంతో క్రేజ్ ఉండేది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఎదురు చూసేవారు.