పఠాన్‌ గండం గట్టెక్కింది

ABN , First Publish Date - 2023-01-07T00:22:59+05:30 IST

షారుఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘పఠాన్‌’ సెన్సార్‌ గండం గట్టెక్కింది. యూ బై ఏ సర్టిఫికెట్‌ సంపాదించుకొంది. ‘

పఠాన్‌ గండం గట్టెక్కింది

షారుఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం ‘పఠాన్‌’ సెన్సార్‌ గండం గట్టెక్కింది. యూ బై ఏ సర్టిఫికెట్‌ సంపాదించుకొంది. ‘పఠాన్‌’లోని ‘బేషరమ్‌’ గీతంపై ఇటీవల తీవ్ర స్థాయిలో విమర్శలు రేకెత్తిన సంగతి తెలిసిందే. ఆ పాటలోని దీపికా పదుకొణె వస్త్రధారణ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఓ వర్గం గట్టిగా ఆరోపించింది. షారుఖ్‌, దీపికలపై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకరమైన దృశ్యాలు, సన్నివేశాలు, సంభాషణలు చాలానే ఉన్నాయని అనుమానాలు రేకెత్తాయి. దాంతో ‘పఠాన్‌’ సెన్సార్‌ సవ్యంగా జరుగుతుందా? లేదా? అనే చర్చ మొదలైంది. అయితే.. సెన్సార్‌ గండాన్ని ‘పఠాన్‌’ దాటేసింది. 13 కట్స్‌తో.. యూ బై ఏ సర్టిఫికెట్‌ పొందింది. అయితే వివాదాలకు కేంద్రబిందువైన కాషాయరంగు వస్త్ర సన్నివేశాన్ని తొలగించారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈనెల 25న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. యాక్షన్‌ చిత్రాల్ని రూపొందించడంలో సిద్దహస్తుడైన సిద్దార్థ్‌ ఆనంద్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది.

Updated Date - 2023-01-07T00:27:59+05:30 IST

Read more