షారుఖ్ ఖాన్ ముక్కుకు గాయం
ABN, First Publish Date - 2023-07-05T02:36:46+05:30
షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గాయపడినట్లు తెలిసింది. లాస్ ఏంజెల్స్‌లో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన ముక్కుకు..
షూటింగ్ నిమిత్తం అమెరికా వెళ్లిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గాయపడినట్లు తెలిసింది. లాస్ ఏంజెల్స్‌లో షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ఆయన ముక్కుకు గాయం అయిందనీ, రక్తం బాగా కారడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించి, ముక్కుకు మైనర్ సర్జరీ చేశారనీ సమాచారం. అయితే ఇది ఎప్పుడు జరిగిందనే విషయంలో స్పష్టత లేదు. సర్జరీ అయిన అనంతరం ఇండియా తిరిగి వచ్చేసిన షారుఖ్ ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే తాప్సీ నటించిన ‘దుంకీ’ సినిమాలో కూడా ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.