దర్శకుడిగా షారుఖ్‌ తనయుడు

ABN , First Publish Date - 2023-05-02T00:05:11+05:30 IST

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ పెద్ద కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ మెగాఫోన్‌ పట్టుకోనున్నారు.

దర్శకుడిగా షారుఖ్‌ తనయుడు

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ పెద్ద కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ మెగాఫోన్‌ పట్టుకోనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నారు ఆర్యాన్‌. దాని పేరేమిటో తెలుసా? స్టార్‌డమ్‌. చిత్ర పరిశ్రమ నేపథ్యంగా రూపుదిద్దుకొనే ఈ వెబ్‌ సిరీస్‌కు రచయిత కూడా ఆర్యనే. ఆరు ఎపిసోడ్స్‌గా ‘స్టార్‌డమ్‌’ రూపుదిద్దుకోనుంది. షారుఖ్‌ ఖాన్‌ సొంత చిత్రనిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌ఓమెంట్‌ బేనర్‌పై రూపుదిద్దుకొనే ‘స్టార్‌డమ్‌’ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఆర్యన్‌ ఖాన్‌ అమెరికాలో ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు పూర్తి చేసుకుని వచ్చారు. అతనికి నటన కంటే దర్శకత్వం మీదే ఆసక్తి. ‘మా వాడికి నటన మీద మోజు లేదు. దర్శకుడు కావాలనే కోరిక. అందుకే అమెరికాలో ఆ కోర్సు పూర్తి చేసుకుని వచ్చాడు’ అని చెబుతుంటారు షారుఖ్‌.

Updated Date - 2023-05-02T00:05:11+05:30 IST