వైష్ణో దేవి ఆలయంలో షారుఖ్!
ABN , First Publish Date - 2023-08-31T02:36:01+05:30 IST
తన సినిమా ‘జవాన్’ విడుదల సందర్భంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మంగళవారం రాత్రి జమ్ము కశ్మీర్‌లో ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు....

తన సినిమా ‘జవాన్’ విడుదల సందర్భంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ మంగళవారం రాత్రి జమ్ము కశ్మీర్‌లో ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. మంగళవారం సాయంత్రం కాట్రా బేస్ క్యాంప్ చేరుకున్న షారుఖ్ తారాకోట్ మార్గం ద్వారా ఆలయానికి వెళ్లి రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అమ్మవారిని సందర్శించి, వెంటనే తిరుగు ప్రయాణం అయ్యారని ఆలయ అధికారులు చెప్పారు. తన ముఖాన్ని పూర్తిగా కప్పేసుకుని బ్లూ జాకెట్‌తో షారుఖ్ ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుఖ్‌తో పాటు కొంతమంది పోలీసులు, ఆయన పర్సనల్ సిబ్బంది, ఆలయ అధికారులు ఈ వీడియోలో కనిపిస్తున్నారు. తొమ్మిది నెలల వ్యవధిలో వైష్ణో మాతను షారుఖ్ సందర్శించడం ఇది రెండో సారి. ‘పఠాన్’ సినిమా విడుదలకు నెల రోజుల మందు అంటే 2022 డిసెంబర్‌లో ఆయన వైష్ణో ఆలయానికి వెళ్లిన సంగతి విదితమే. ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న విడుదల కానుంది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకోన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు.