శాకుంతలం సిద్ధం...

ABN , First Publish Date - 2023-01-07T00:32:09+05:30 IST

సమంత టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకుడు. నీలిమ గుణ నిర్మాత. త్రీడీ టెక్నాలజీలో రూపొందించిన చిత్రమిది.

శాకుంతలం సిద్ధం...

సమంత టైటిల్‌ పాత్ర పోషించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకుడు. నీలిమ గుణ నిర్మాత. త్రీడీ టెక్నాలజీలో రూపొందించిన చిత్రమిది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈనెల 9న ట్రైలర్‌ ఆవిష్కరిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. పురాణాల్లోని దుష్యంతుడు, శాకుంతల మధ్య జరిగిన ప్రేమ గాథని అందమైన దృశ్యకావ్యంగా గుణశేఖర్‌ తీర్చిదిద్దారని, వెండి తెరపై ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతుల్ని పంచుతుందని చిత్రబృందం తెలిపింది. మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందించారు.

Updated Date - 2023-01-07T00:32:15+05:30 IST

Read more