సీక్వెల్‌కి రంగం సిద్ధం
ABN , First Publish Date - 2023-09-12T00:39:13+05:30 IST
2007లో విడుదలైన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. వెంకటేశ్-త్రిష జంటగా నటించిన చిత్రమిది...

2007లో విడుదలైన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకొంది. వెంకటేశ్-త్రిష జంటగా నటించిన చిత్రమిది. వారిద్దరి కెమిస్ర్టీ ఆకట్టుకొంది. సెల్వరాఘవన్ దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది. ‘‘చాలా కాలం తరవాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చూశా. వెంకీ, త్రిషలతో మరోసారి పనిచేయాలని ఉంది. సీక్వెల్‌కు రెడీయేనా’’ అంటూ సెల్వరాఘవన్ ట్వీట్ చేస్తే.. దానికి సమాధానంగా త్రిష ‘నేను రెడీ’ అంటూ సందేశం ఇచ్చారు. దాంతో ‘ఆ.మా.అ.వే 2’కి తలుపులు తెరచుకొన్నట్టైంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘యారడీ నీ మోహిని’ చిత్రానికి ఇది రీమేక్. అక్కడ ధనుష్ - త్రిష జంటగా నటించారు. ఒకవేళ ఈ చిత్రానికి సీక్వెల్ గనుక తీస్తే.. తమిళంలోనూ మళ్లీ ధనుష్, త్రిషలే జంటగా కనిపించే ఛాన్సుంది.