సిక్స్‌టీన్స్‌కు సీక్వెల్‌

ABN , First Publish Date - 2023-03-26T00:45:12+05:30 IST

చాలా ఏళ్ల క్రితం వచ్చిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘సిక్స్‌టీన్స్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘రిస్క్‌’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘సిక్స్‌టీన్స్‌’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఘంటాడి కృష్ణ ఈ సినిమాకు...

సిక్స్‌టీన్స్‌కు సీక్వెల్‌

చాలా ఏళ్ల క్రితం వచ్చిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘సిక్స్‌టీన్స్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ‘రిస్క్‌’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘సిక్స్‌టీన్స్‌’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన ఘంటాడి కృష్ణ ఈ సినిమాకు నిర్మాత కావడం విశేషం. ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం మరో విశేషం. రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రూపుదిద్దుకొంటున్న ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ ‘సొగసుకే సోకు’ను ఇటీవల విడుదల చేశారు. సిద్‌ శ్రీరామ్‌ పాడిన ఈ పాటను దర్శకనిర్మాత ఎమ్మెస్‌ రాజు విడుదల చేశారు. మోషన్‌ పోస్టర్‌ను మైత్రీ మూవీస్‌ అధినేతల్లో ఒకరైన యలమంచిలి రవిశంకర్‌ ఆవిష్కరించారు. ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ ‘సిక్స్‌టీన్స్‌’ కు కొనసాగింపుగా ఓ సినిమా తీయాలనే ఆలోచన నాకు చాలా కాలంగా ఉంది. ఆ సినిమా కోసం నేను స్వరపరిచిన ‘దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలే’ పాట ఆ రోజుల్లో పెద్ద హిట్‌. అప్పట్లో యూట్యూబ్‌ లేదు. కేవలం ఆడియో సీడీలు మాత్రమే ఉండేవి. ఈ పాట వల్లే 25 లక్షల సీడీలు అమ్ముడయ్యాయని ఆడియో కంపెనీ అధినేత తెలిపారు. రావి సురేశ్‌రెడ్డి, గడ్డం రవి, మహేశ్‌ కాలే, గుర్రం నరసింహులు సహకారంతో ‘రిస్క్‌’ చిత్రం తీశాను’ అని తెలిపారు.

Updated Date - 2023-03-26T00:45:14+05:30 IST