సెల్ఫిష్‌... దిల్‌ ఖుష్‌

ABN , First Publish Date - 2023-05-02T00:17:53+05:30 IST

ఆశిష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సెల్ఫిష్‌’. కాశీవిశాల్‌ దర్శకుడు. సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థతో కలిసి దిల్‌ రాజు నిర్మించారు.

సెల్ఫిష్‌... దిల్‌ ఖుష్‌

ఆశిష్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సెల్ఫిష్‌’. కాశీవిశాల్‌ దర్శకుడు. సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థతో కలిసి దిల్‌ రాజు నిర్మించారు. సోమవారం శిరీష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘దిల్‌ ఖుష్‌’ అనే గీతాన్ని ఆవిష్కరించారు. రామజోగయ్యశాస్ర్తి రాసిన పాట ఇది. మిక్కీ జె.మేయర్‌ స్వరాలు అందించారు. జావేద్‌ అలీ ఆలపించారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘రౌడీబోయ్స్‌ సినిమా చేస్తున్నప్పుడే ఈ ఐడియా విన్నాను. బాగా నచ్చింది. పందొమ్మిదేళ్ల తరవాత సుకుమార్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను, సుకుమార్‌ ఈ సినిమాకి వెనుక నుంచి సపోర్ట్‌ చేస్తాం. కానీ కష్టపడాల్సింది మాత్రం టీమ్‌ మాత్రమే. ఆశిష్‌ కష్టపడి, మంచి కథలు ఎంచుకొంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తార’’న్నారు. ‘‘దర్శకుడికీ నాకూ.. ఇది లైఫ్‌ ఇచ్చే సినిమా. అందుకే ఇద్దరం బాగా కష్టపడుతున్నాం. రామజోగయ్యశాస్ర్తి చాలా మంచి పదాలతో ఈ పాట రాశారు. తెరపై అద్భుతంగా తెరకెక్కించార’’న్నారు ఆశీష్‌.

Updated Date - 2023-05-02T00:17:53+05:30 IST