కొత్త వెంకీని చూస్తారు!

ABN , First Publish Date - 2023-10-17T03:30:09+05:30 IST

వెంకటేశ్‌ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్‌’ టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సవాజ్‌ సిద్దిఖి విలన్‌గా నటిస్తున్నారు...

కొత్త వెంకీని చూస్తారు!

వెంకటేశ్‌ నటిస్తున్న 75వ చిత్రం ‘సైంధవ్‌’ టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సవాజ్‌ సిద్దిఖి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘ఒక ప్రత్యేక కథ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో దర్శకుడు శైలేష్‌ ‘సైంధవ’ కథ చెప్పారు. బలమైన ఎమెషన్‌, యాక్షన్‌కి స్కోప్‌ ఉన్న కథ ఇది. అందుకే వెంటనే ఓకే చెప్పాను. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. ఇందులో కొత్త వెంకీని చూస్తారు. ఇంటెన్స్‌ యాక్షన్‌, ఎమోషన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందరం చాలా కష్టపడి చిత్రాన్ని పూర్తి చేశాం. జనవరి 14న విడుదలవుతుంది. సంక్రాంతికి వచ్చిన నా చిత్రాలు ‘చంటి’, ‘కలిసుందాం రా’, ‘లక్ష్మి’ విజయం సాధించాయి. అలాగే ‘సైంధవ్‌’ కూడా సక్సెస్‌ అవుతుంది’ అన్నారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖి మాట్లాడుతూ ‘మా అన్నయ్య వెంకటేశ్‌ అద్బుతమైన నటుడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వెంకటేశ్‌గారి 75వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ టీజర్‌లో చూసింది చిన్న గ్లింప్స్‌ మాత్రమే. సినిమాలో చాలా విషయం ఉంది’ అన్నారు. వెంకటేశ్‌తో సినిమా తీసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చిత్ర నిర్మాత వెంకట్‌ బోయనపల్లి చెప్పారు.

Updated Date - 2023-10-17T03:30:09+05:30 IST