అనిల్‌ రావిపూడితో రెండోసారి?

ABN , First Publish Date - 2023-08-29T03:18:40+05:30 IST

‘సరిలేరు నీకెవ్వరు’ మహేశ్‌బాబు ఖాతాలో ఓ కమర్షియల్‌ హిట్‌ పడింది. ఈ సినిమాతో స్టార్‌ హీరోల్నీ డీల్‌ చేయగలనని నిరూపించుకొన్నాడు అనిల్‌ రావిపూడి...

అనిల్‌ రావిపూడితో రెండోసారి?

‘సరిలేరు నీకెవ్వరు’ మహేశ్‌బాబు ఖాతాలో ఓ కమర్షియల్‌ హిట్‌ పడింది. ఈ సినిమాతో స్టార్‌ హీరోల్నీ డీల్‌ చేయగలనని నిరూపించుకొన్నాడు అనిల్‌ రావిపూడి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జోడీ కట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మహేశ్‌ కోసం అనిల్‌ రావిపూడి ఓ కథ సిద్దం చేశారని టాక్‌. మహేశ్‌ ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఆ తరవాత.. రాజమౌళితో సినిమా చేయాలి. రాజమౌళితో సినిమా అంటే కనీసం రెండేళ్లు కేటాయించాల్సిందే. ప్రీ ప్రొడక్షన్‌ కోసం రాజమౌళి చాలా సమయం తీసుకొంటారు. ఒకవేళ ‘గుంటూరు కారం’, రాజమౌళి చిత్రాల మధ్య గ్యాప్‌ ఎక్కువగా ఉన్నట్టైతే అనిల్‌ రావిపూడి సినిమా మొదలవుతుంది. లేదంటే.. రాజమౌళి సినిమా పూర్తయ్యాకే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ‘భగవంత్‌ కేసరి’ ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-08-29T03:18:40+05:30 IST