సంస్కరణకు సంగీతం స్కూల్
ABN , First Publish Date - 2023-03-29T02:27:57+05:30 IST
షర్మన్ జోషి, శ్రియా శరణ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యం వహించారు. పాపారావు బియ్యాల దర్శకుడు. మే 12న పలు భాషల్లో విడుదలవుతోంది...

షర్మన్ జోషి, శ్రియా శరణ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యం వహించారు. పాపారావు బియ్యాల దర్శకుడు. మే 12న పలు భాషల్లో విడుదలవుతోంది. మంగళవారం చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో చదువుకోవడానికి పిల్లలు ఎంత ఒత్తిడి అనుభవిస్తున్నారనేది తెలిపే చిత్రమే ‘మ్యూజిక్‌స్కూల్’. తెలుగులో మేం విడుదల చేస్తున్నాం’ అన్నారు. ‘చదువు పిల్లల ఎదుగుదలకు సమస్యకు మారుతోంది. దాన్ని సంగీత రూపంలో వినోదాత్మకంగా చెప్పడానికి ప్రయత్నించామ’ని పాపారావు చెప్పారు.