భయపెట్టే తంతిరం

ABN , First Publish Date - 2023-09-13T00:16:07+05:30 IST

శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం ‘తంతిరం’. ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్‌ కాండ్రగుల నిర్మాత...

భయపెట్టే తంతిరం

శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంక శర్మ జంటగా నటించిన చిత్రం ‘తంతిరం’. ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్‌ కాండ్రగుల నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంగళవారం టీజర్‌ విడుదల చేశారు. ‘‘హారర్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. అన్యోన్యంగా కాపురం చేసుకొంటున్న భార్యాభర్తల మధ్యకు ఓ ఆత్మ వస్తే ఎలా ఉంటుందో తెరపై చూపిస్తున్నాం. టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామ’’న్నారు నిర్మాత. సంగీతం: అజయ్‌ ఆరాసాడా.

Updated Date - 2023-09-13T00:16:07+05:30 IST