శివరాత్రికి ఊ అంటావా...
ABN , First Publish Date - 2023-02-08T23:55:07+05:30 IST
యశ్వంత్, రాకింగ్ రాకేశ్ , అనన్య, హిందోలా చక్రవర్తి , పూజ, సిమ్రాన్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’...

యశ్వంత్, రాకింగ్ రాకేశ్ , అనన్య, హిందోలా చక్రవర్తి , పూజ, సిమ్రాన్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. సీనియర్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మించారు. మంగళవారం హైదరాబాద్‌లో రేలంగి మాట్లాడుతూ ‘ఇప్పటి వరకూ రాని కామెడీ, హారర్ థ్రిల్లర్ ఇది. ఈ కథ ఎంపిక సమయంలో దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ సలహాలతో పాటు అజయ్‌కుమార్, చదలవాడ శ్రీనివాసరావుల సలహాలు తీసుకున్నాం. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘ రేలంగిగారికి ఇది 76వ చిత్రం. చాలా చక్కగా తీశారు. మా టీమ్ అంతా డబ్బు కోసం కాకుండా ఇది మన సినిమా అనే భావనతో పనిచేశారు. మహా శివరాత్రి సందర్బంగా ఈ నెల 18న విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.