సత్యభామ జోరు...

ABN , First Publish Date - 2023-09-01T04:03:53+05:30 IST

అశోక్‌ గల్లా కథానాయకుడిగా అర్జున్‌ జంథ్యాల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. సోమినేని బాలకృష్ణ నిర్మాత...

సత్యభామ జోరు...

అశోక్‌ గల్లా కథానాయకుడిగా అర్జున్‌ జంథ్యాల దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ప్రశాంత్‌ వర్మ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. సోమినేని బాలకృష్ణ నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా మిస్‌ ఇండియా మానస వారణాసిని పరిచయం చేస్తున్నారు. ‘‘మాసన ఈ చిత్రంలో సత్యభామ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. ఆమె నటన, పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. తెలుగు తెరకు మరో మంచి హీరోయిన్‌ దొరికినట్టే. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’న్నారు నిర్మాత. సంగీతం: భీమ్స్‌.

Updated Date - 2023-09-01T04:03:53+05:30 IST