సరోజ పోరాటం
ABN, First Publish Date - 2023-09-09T04:14:55+05:30
ఆడపిల్లలను కాపాడుకోవాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘నేనే సరోజ’. శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రచయిత డాక్టర్ సదానంద్
ఆడపిల్లలను కాపాడుకోవాలనే సందేశంతో తెరకెక్కిన చిత్రం ‘నేనే సరోజ’. శ్రీమాన్ గుమ్మడవెల్లి దర్శకత్వంలో రచయిత డాక్టర్ సదానంద్ శారద నిర్మించారు. శాన్విమేఘన, కౌశిక్‌బాబు జంటగా నటించారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆవిష్కరించారు. ఉన్మాదులను ఎదిరించే కాలేజీ విద్యార్థిని పాత్రలో శాన్వీ మేఘన పవర్‌ఫుల్‌గా నటించారని ఆయన అభినందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఆడపిల్లల మీద దాడిచేసే ఉన్మాదులకు సరోజ గుణపాఠం చెబుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిదని’ అన్నారు. హృద్యమైన సంగీతం, ఆలోచింపజేసే సంభాషణలు, శాన్వీ మేఘన వీరోచిత పోరాటాలు ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రమేశ్ ముక్కెర.